కోరుట్ల, ముద్ర: కోరుట్ల పట్టణానికి చెందిన కళాకారుడు, కోరుట్ల బ్రహ్మణ సేవాపరిషత్ ప్రధానకార్యదర్శి కలకుంట్ల నితిన్ కుమార్ ఆచార్యను హైద్రాబాద్ లో జాతీయ సాహిత్య పరిషత్ నిర్వహణలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో సన్మానించారు. నితిన్ కుమార్ రాసిన కవితను కవితా సంకలనం పుస్తకంలో జాతీయ సాహిత్యపరిషత్ వారు ప్రచురించారు. అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, తాను రాసిన కవితను నితిన్ కుమార్ విచ్చేసిన అతిథులముందు చదివి వినిపించగా జ్ఞాపిక, శాలువా, గ్రంథాలతో సత్కరించి, అభినందించారు. నితిన్ కుమార్ భవిష్యత్ లో కూడా ఇలాంటి సమాజ చైతన్య కవితలు రాయలని విచ్చేసిన వక్తలు, కార్యక్రమ నిర్వాహకులు ప్రోత్సహించారు.