ముద్ర, జగిత్యాల టౌన్: పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపించాలని ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో లైటింగ్, చలువ పందిళ్లు, మొరం, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. జాతర ఏర్పాట్లను నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఎమ్మెల్యే సూచించారు. ఇందులో మాజీ కౌన్సిలర్ పంబాల రాము, అధ్యక్షులు నీలం పెద్దలు, రాజేష్, కట్ట గంగాధర్ పాల్గొన్నారు.