Take a fresh look at your lifestyle.

అంగన్ వాడీ కేంద్రాలు బలోపేతానికి కృషి చేద్దాం

  • ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పిల్లలకు విద్యా బోధన అందిద్దాం.
  • మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ.

కోరుట్ల, ముద్ర విలేకరి:  అంగన్ వాడీ కేంద్రాలు బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలని మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్పాక మణెమ్మ అన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్ వాడి బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని రవీంద్ర రోడ్ ఖాజీపుర లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ కాశ్పాక మణెమ్మ మాట్లాడుతూ అన్ని అంగన్ వాడి కేంద్రాల్లో మొక్కల విత్తనాలు వేద్దాం, కిచెన్ గార్డెన్లను పెంపొదిద్దాం అన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పిల్లలకు విద్యా బోధన అందించాలని సూచించారు. అంగన్ వాడీల బలోపేతం చేసేలా మూడు సంవత్సరాలు పూర్తి అయిన పిల్లల అందరిని కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు ఆమె అవగాహన కల్పించారు. అంగన్ వాడీ కేంద్రాలను రూపుదిద్దడానికి ప్రభుత్వo అన్ని రకాల సౌకర్యాలు టాయిలెట్స్, వాటర్ సరఫరా, కరెంటు ప్రీస్కూల్, మెటీరియల్, యూనిఫామ్స్ సప్లై చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, పిల్లల తల్లులకు ప్రీస్కూల్ విద్యపై అవగాహన కల్పించారు. ఆటపాటలతో కూడిన విద్య చెబుతున్నామని సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి, అంగన్ వాడీ టీచర్ జి. రాజమణి, ఆయా గంగాభవాని, తల్లులు పిల్లలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.