పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కథ రొటీన్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మేనియా సినిమాను నడిపించింది.
*కథ సారాంశం:* అనాథ అయిన చిన్నయ్యకు ‘భగత్ సింగ్’గా పేరు పెట్టి ఉపాధ్యాయుడు మార్గదర్శనం చేస్తాడు. ఆ ఉపాధ్యాయుడు సీఎం అవుతాడు. అతడిని చంపి అధికారం దక్కించుకోవాలని చూసే నల్ల నాగప్ప నుంచి సీఎం ను భగత్ సింగ్ ఎలా కాపాడాడనేది కథ.
*విశ్లేషణ:* ఫస్టాఫ్ పెద్దగా ఆకట్టుకోదు. కానీ సెకండాఫ్‌లో శ్రీలీల ఎపిసోడ్‌తో సినిమా ఊపు అందుకుంటుంది. ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కథ ముందే ఊహించదగినదే అయినా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ మెయిన్ హైలైట్.
*పర్ఫామెన్స్:* పవన్ కళ్యాణ్ తన స్టైల్‌తో మెప్పించాడు. శ్రీలీల ఎపిసోడ్స్ ప్లస్ అయ్యాయి. రాశి ఖన్నా ఓకే. విలన్‌గా పార్తీబన్ సెటిల్డ్‌గా నటించాడు.
*టెక్నికల్:* దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్థాయిలో ఉన్నాయి.
*ప్లస్ పాయింట్స్:* పవన్ కళ్యాణ్, సెకండాఫ్, శ్రీలీల *మైనస్ పాయింట్స్:* ఫస్టాఫ్, రొటీన్ కథ, కామెడీ
*తీర్పు:* పవన్ అభిమానులకు నచ్చే మాస్ ఎంటర్‌టైనర్. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఓకే అనిపించే సినిమా.
*రేటింగ్: 2.5/5*
అజయ్ యాదవ్, ముద్ర