Take a fresh look at your lifestyle.

సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ సముదాయం లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు బీసీ నాయకుడు గొల్ల కురుమల ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నిజాం అశ్రప్ అలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రభుత్వ కార్యక్రమంలో తెలంగాణా మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి రమాకాంత్, నాగర్ కర్నూల్ జిల్లా బీసీ ఉద్యమకారుడు శ్రీ అరవింద చారి, బడుగు వర్గాల నాయకులు జెట్టి శ్రీనివాస్, నాగర్ కర్నూల్ జిల్లా మేదరి మహేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు కోన తిరుపతయ్య పాల్గొని దొడ్డి కొమరయ్య యొక్క పోరాటపటీమను, పెత్తందారులపై, దొరలపైన సమానత్వం కోసం, ఆస్తులు పైన విధించిన పన్నులకు వ్యతిరేకంగా కారంఫొడి అనే సంస్థని స్థాపించి ఉద్యమించి 19 సంవత్సరాల అతి చిన్న వయసులో సాయుధ పోరాటం చేసి అమరుడైన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా అచ్చంపేటకు చెందిన రామాకాంత్ మాట్లాడుతూ దొడ్డి కుమరయ్య చేసినటువంటి పోరాటం నేటి బీసీలకు స్ఫూర్తి కావాలని బీసీలందరూ ఐక్యమై తమ హక్కులను సాధించుకోవాలని ఓటు బ్యాంకుగా ఉండకుండా బీసీల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు.ప్రభుత్వం కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు అన్ని విధాల సహకరించాలని పిలుపునిచ్చారు .ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖా కార్యాలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, సురేష్ , నాగర్ కర్నూల్ పట్టణ మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ పులి వీరేష్, తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాలులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.