Take a fresh look at your lifestyle.

మెదక్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు పక్కదారి పడితే కఠిన చర్యలు-కలెక్టర్ ప్రతిమా సింగ్

కంట్రోల్ రూమ్ ఏర్పాటు 9391942254

ముద్ర ప్రతినిధి, మెదక్:

మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు గ్యాస్ సిలిండర్ల కొరత లేదు, పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. శుక్రవారం
కలెక్టరేట్ లో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డీ.వి. శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ మెంచు నగేష్ లతో కలిసి మాట్లాడారు.
జిల్లాలో 3,84,373 కనెక్షన్ లు ఉన్నాయి.
16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. నర్సాపూర్ లో హోటళ్లు, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేశామని తెలిపారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి అడ్వాన్సుగా బుకింగ్ చేసుకోవద్దని సూచించారు.
జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా సాధారణంగా, నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్, హాస్టల్, ఓల్డ్ ఏజ్ హోం, పాఠశాలలు, అత్యవసర సేవలలో గ్యాస్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆమె హెచ్చరించారు. తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా సందేహాలు, జిల్లా కంట్రోల్ రూం ఏర్పాటు చేసశామని తెలిపారు. గ్యాస్ సమస్యలు ఉంటే 9391942254 నెంబర్ ను సంప్రదించాలన్నారు. పర్యవేక్షణకు పోలీస్, సివిల్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తరన్నారు.
పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలు అయితే 45 రోజులకు ఒకసారి గ్యాస్ బుక్ చేసుకోవాలని గ్యాస్ వినియోగదారులకు సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితులు లేదా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో, సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గ్యాస్ కొరత ఉందని వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లింక్ లు వచ్చిన ఓపెన్ చేయకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ సైబర్ క్రైమ్ కు గురి కావొద్దన్నారు. ఈ జిల్లా డిసీఎస్ఓ నిత్యానంద, డిపిఆర్ఓ రామచంద్ర రాజు, డిఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ జర్జీ, ఏపీఆర్ఓ బాబురావు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.