-వివాహవేడుకలో మాట నిలుపుకున్న నేత
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : కౌన్సిలర్ ఉదారత్వంతో ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించి వార్డు ప్రజల మన్ననలను పొందుతున్న సందర్బమిది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ వివాహానికి రూ. 21 వేల ఆర్థిక సాయం అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 30 వ వార్డు ఇంద్రనగర్ కౌన్సిలర్ విజయలక్ష్మి నాగరాజు తన ఎన్నికల హామీలో భాగంగా 30వ వార్డు పరిధిలోని ప్రతి ఆడబిడ్డకు తన వంతు సహకారంగా రూ. 21వేలు ఆర్థిక సాయం అందిస్తానన్న మాట నిలుపుకుని తన గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 30వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి నాగరాజు
ఎన్నికలలో భాగంగా 30వ వార్డు ఇందిరానగర్ కాలనీకి చెందిన బందయ్య గౌడ్ కూతురు స్వాతి వివాహానికి ఆదివారం ఆర్థిక సహయం అందించారు. ఇంద్రానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగరాజు మాట్లాడుతూ కాలనీ ప్రజలు మమ్మల్ని నమ్మి కౌన్సిలర్ గా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి కాలనీ సీనియర్ నాయకులు, ప్రజల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాడంతో వార్డు అభివృద్ధికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బందయ్య గౌడ్ కుటుంబ సభ్యులు కాలనీ ప్రజలు బంధువులు పాల్గొన్నారు.