సామాజిక శాస్త్రాల పరిశోధకులకు పెరుగుతున్న ఉపాధి అవకాశాలు * ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మంజుల్ సింగ్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట సామాజిక శాస్త్రాల విభాగ ఆధ్వర్యంలో సోమవారం
పరిశోధన పద్ధతుల పైన జాతీయస్థాయి వెబినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి , ముఖ్యఅతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ప్రొఫెసర్ ఎం. రాములు , గౌరవ అతిథిగా ఢిల్లీ యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ మంజుల సింగ్, ప్రధాన భక్తగా తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ నుండి డా. కప్ప కొండల్ హాజరయ్యారు.
వక్త డాక్టర్ కొండలు మాట్లాడుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పరిశోధనలు ఎలా ప్రారంభించాలో వాటి మెలకువలను నాణ్యత ప్రమాణాలను విద్యార్థులకు తెలిపారు. పరిశోధనలు ఎంపిక, రివ్యూ ఆఫ్ లిటరేచర్ , రీసెర్చ్ గ్యాప్, ఆబ్జెక్టివ్స్ , దత్తాంశ సేకరణ , దత్తాంశ విశ్లేషణ ప్రాజెక్టు రూపకల్పన మొదలైన అంశాలపై క్షుణ్ణంగా విద్యార్థులకు బోధించారు. శాస్త్రీయమైన పద్ధతులతో పరిశోధనలు చేసినప్పుడే విద్యార్థులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ ప్రొఫెసర్ మంజుల సింగ్ మాట్లాడుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక విద్యార్థులు పరిశోధన వైపు దృష్టి పెడితే అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికప్పుడు నాణ్యత ప్ర ప్రమాణాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు ఈ సమాజానికి ఎంతో అవసరమని మార్కెట్ అంతా పరిశోధన పైన ఆధారపడి ఉందని తెలిపారు.నిష్ణాతులైన పరిశోధకులకు అనేక సంస్థలు ఉపాధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రొఫెసర్ రాములు మాట్లాడుతూ పరిశోధనకు మూలము సమస్యను ఎంచుకోవడంలోనే పరిశోధన ఆధారపై ఉంటుందని తెలిపారు. ఇటువంటి వెబినార్లు విద్యార్థులు పరిశోధన పట్ల ఆకర్షితులయ్యే విధంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ జాతీయ స్థాయి వెభినార్ కన్వీనర్ డా. ఎం శ్రద్ధానందం మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధన నైపుణ్యాలను మరింతగా పెంపొందించడానికి వెభినార్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కళాశాల ఐక్యవేసి కోఆర్డినేటర్ డా . సీ.హెచ్.మధుసూదన్, పరీక్షల నియంత్రణ అధికారి డా.గోపాల్ సుదర్శనం కార్యక్రమం కన్వీనర్ డా.ఏ. అనురాధ, డా.ఎన్ హరిబాబు అధ్యాపకులు డా. ఎం కొండల్ రెడ్డి, బి బిక్షపతి కే శేఖర్ , పద్మ, ఎస్ మహేందర్ 150 విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యప్రదేశ్ నుండి విద్యార్థులు కూడా దీనిలో పాల్గొన్నారు.