Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యల. పరిష్కారనికే ప్రజావాణి  అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ 

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్ అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో  ప్రజావాణి కార్యక్రమం ద్వారా  ఫిర్యాదుదారుల నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్ తో కలిసి ఆయన దరఖాస్తులను స్వీకరించారు.
దరఖాస్తు దారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను  ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్ల మరియు ఇతర అర్జిలు మొత్తం 163 వచ్చాయి. అర్జిదారులకు న్యాయం చేసి తిరిగి అర్జి పెట్టుకోకుండా పని చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డి ఆర్ ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్ కుమార్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.