Take a fresh look at your lifestyle.

ఇచ్చిన హమీ మేరకు పెన్షన్ ఇవ్వాలి- సి ఐ టి యు డిమాండ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని వెంటనే ప్రారంభించి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు ₹.4016 పెన్షన్‌ను తక్షణం అమలు చేయాలని సి ఐ టి యు డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రావిడెంట్ ఫండ్ కార్డు ఉన్న ప్రతి కార్మికురాలికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రంలో కోరారు. సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ జిల్లాలో బీడీ కార్మికులకు పి ఎఫ్ అర్హత కల్గిన బీడీ కార్మికులందరికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ కోసం ఆన్లైన్ విధానం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెలకు ₹.4016 పెన్షన్ తక్షణం అమలు చేయాలనీ కోరారు. రాజీనామా చేసిన కార్మికులందరికీ పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలనీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.