Take a fresh look at your lifestyle.

ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ పాలన..

ముద్ర, శేరిలింగంపల్లి:
‘ప్రజల కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుంది’ అనే భావనకు ప్రతీకగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలు కొందరు అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన అనంతరం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి, వారికి మంజూరైన రూ.19,58,000 చెక్కును నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితురాలికి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ప్రభుత్వం బాధితుల పట్ల చూపించే మానవత్వం, బాధ్యతకు నిదర్శనం అని, ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు లేదా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులే కాకుండా ఏదైనా క్లిష్ట సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగులుతుందని అన్నారు. మనందరం కూడా బాధితులకు సహకరించే భావనతో ముందుకు రావాలని, అవసరమైన వారికి ఈ సహాయనిధి గురించి తెలియజేసి వారికి దరఖాస్తు చేయడంలో సహాయం చేయాలి, ప్రజల కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుందని ప్రతి ఒక్కరికీ తెలియాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్, మహిపాల్ యాదవ్, కావూరి ప్రసాద్, సురేష్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, మల్లికార్జున్ యాదవ్, దొంతి సత్యం, జనార్దన్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, తిరుపతి, రవీందర్ రెడ్డి, జహంగీర్, తిరుపతి, గిరి బాబు, సౌందర్యరాజన్, శ్రీహరి, సుధాకర్, లక్ష్మణ్, రాంచందర్, రవి కుమార్, శివ కుమార్, కార్తీక్ గౌడ్, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి, అనిత, జయ, సారా ఖాన్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.