Take a fresh look at your lifestyle.

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు పాఠశాల విద్యాశాఖ ప్రకటన

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు ఓంటి పూట బడుల నిర్వహణకు సంబంధించి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారన్నారు. పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు, పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరుక పని చేస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని డీఈవోలను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.