Take a fresh look at your lifestyle.

కస్తూర్భ గాంధీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అన్నం, గుడ్డు కూర, ఆలుగడ్డ టమాట కూరలను పరిశీలించారు. బిర్యానీ అన్నం నాణ్యత సరిగా లేదని బిర్యానీలో బిర్యానీ ఆకు లేకుండా ఎలా వండారని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటలు నాణ్యతగ రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ రూమ్ లో కూరగాయలను, వంట సరుకులను పరిశీలించారు. నాణ్యమైన సరుకులనే వాడాలని కాలం చెల్లిన పదార్థాలను వాడకూడదని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేశారు చేసిన వంటకు రిజిస్టర్ రాసిన సరుకులకు అస్సలు పొంతనలేదని ఎస్ఓ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాక్షన్ తీసుకోవాలని డిఈఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థులకు భోజనం, వసతి విషయంలో రాజి పడవద్దని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. విద్యాలయంలో మరుగుదొడ్లు చుట్టుపక్కల ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రహరీగోడ పైన సోలార్ ఫినిషింగ్ ఉండే విధంగా చూసుకోవాలని ఎస్ఓ ను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.