ముద్ర, గద్వాల:
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మీ నర్శింహులు యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. తన కుమారుడు సాయి సాకేత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మీ ఎలాంటివి వృధా ఖర్చులు పెట్టకుండా ప్రస్తుతం వేసవికాలం సందర్భంగా ప్రజలకు ఉపయోగకరమైన చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రజల దహార్తిని తీర్చేలా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. అదే విధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణుగోపాల్, మాజీ పీఏసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, కౌన్సిలర్లు నాయకులు, తదితరులు పాల్గొన్నారు .