Take a fresh look at your lifestyle.

వైద్య విద్యార్ధి కి ఆర్థిక సాయం

 
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
మారేపల్లి సురేందర్ రెడ్డి పౌండేషన్ ద్వారా పేద వైద్య విద్యార్థి కి రూ. 2.10 లక్షల ఆర్థిక సాయం అందించారు.ఆదివారం మహబూబ్ నగర్ 38వ డివిజన్ కి చెందిన బి.వెంకటేశ్వర్లు, లావణ్య దంపతుల కుమార్తె భాగ్య లక్ష్మీ వైద్య విద్య అభ్యస్తున్నారు. ప్రస్తుతం
2వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధినికి కళాశాల, హాస్టల్ వసతి నిమిత్తం ఈ అమౌంట్ ను మహబూబ్ నగర్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి కూతురు, ఎం ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మారేపల్లి మహతి రెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థినికి అందించారు.ఈ సందర్బంగా మహతి రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యానిధి కార్యక్రమాన్ని స్ఫూర్తి గా తీసుకుని పేద విద్యార్థుల ను ఈ పౌండేషన్ ద్వారా ఆడుకుంటున్నామన్నారు. భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ పౌండేషన్ ద్వారా చేపడతామనని ఆమె తెలిపారు.మా నాన్న సురేందర్ రెడ్డి సహకారం తో జిల్లా లోని పేద విద్యార్థుల కు ఏ కష్టం వచ్చినా ఈ పౌండేషన్ వారికి అండగా ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.