Take a fresh look at your lifestyle.

మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం..

కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం..
ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం..
వేగంగా స్పందించని పోలీసులు, అధికారులపై ఫైర్

ముద్ర, కరీంనగర్:

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులుకరీంనగర్ లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గానికి చెందిన రైతులను పరామర్శించడానికి మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడో అంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. లిఫ్ట్ పడిపోవడంతో మంత్రి ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా షాక్ నుంచి తేరుకొని బయటపడ్డారు. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రమాదం అనంతరం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి పనితీరుపై తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రికి మెడికల్ కు సంబంధం లేని వ్యక్తులు నిర్వహిస్తూ ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కనీస వైద్య సదుపాయాలు లేకున్నా అర్హత లేని ఆర్ఎంపీ వైద్యులతో ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. కరీంనగర్ లో మెడికల్ మాఫియా రాజ్యం ఏలుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు లేకుండా మంత్రి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన జరిగిన తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆలస్యంగా స్పందించడంపైనా మంత్రి అసహనం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ ఘటనాస్థలికి ఆలస్యంగా చేరుకోవడంతో ఆయనపై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసులు కూడా మంత్రి ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రికి వేగంగా చేరుకోలేకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. మంత్రి అయినా తనకే ఇలాంటి పరిస్థితి.. సామాన్యులకు ఇదే ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ఘటనతో మంత్రి అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మంత్రి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.