Take a fresh look at your lifestyle.

ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ విరాళం అందజేత

తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జూన్ 2 నుంచి 5 వరకు జరిగే శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ విరాళం అందజేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే అందజేసిన రూ.25వేల విరాళం అందజేశారు.ఈ సందర్భంగా గొట్టిపర్తి గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, రాములు గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, గొట్టిపర్తి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బర్ల సోమన్న బీఆర్ఎస్ నాయకులు తెడ్డు హరిబాబు, దూదిగాని లింగయ్య, బాలగాని ప్రవీణ్, దొంగరి వెంకన్న, తాళ్లపల్లి యాకన్న, రాజరికం వెంకటాచారి, చింతకుంట్ల సురేష్, పరశురాము, గునిగంటి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.