Take a fresh look at your lifestyle.

సన్న బియ్యంతో పేదలకు లబ్ధి

  • డి సి సి అధ్యక్షులు శ్రీ హరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం పేదలకు ఎంతో చేయూత ఇస్తుందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లిలో సన్న బియ్యం లబ్ధిదారులు రాజుల లక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ వివరాలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యం పథకంపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ముచ్చటిస్తూ సన్న బియ్యం పథకంతో పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుంట వేణుగోపాల్, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు సాద సుదర్శన్, కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి, గాండ్ల విలాస్, కుంట పద్మాకర్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.