ముద్ర, సారంగాపూర్ : జగిత్యాల మండలంలోని మోరుపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన నిందితులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పూడూరి శోభన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ ఇలాంటి చర్యలకు పాడుపడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, గత నెలలో మండలంలోని నాగునూరులో విగ్రహాన్ని అవమాపరిచిన సంఘటన మరువకముందే ఇలాంటి చర్యలకు పాల్పడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నిందితులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శాతరాజు లక్ష్మీరాజ్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేర మహేష్, నాలువల ప్రవీణ్, శతరాజ్ ధర్మయ్య, చిట్యాల మల్లయ్య, జంగం రవీందర్, మేకల లచ్చయ్య, మనోహర్, హరీష్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.