Take a fresh look at your lifestyle.

దేశంలో మన రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలి- వంటేరు ప్రతాప్ రెడ్డి….

 

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం, కొండపాక మండల పరిధిలోని సిరసనగాండ్ల గ్రామానికి చెందిన మహమ్మద్ అజీమ్ కూతురు సుహనా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి మండలంలో ఉత్తమ విద్యార్తిగా నిలిచింది. ఈ సందర్బంగా  బీ ఆర్ ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కొండపాక  మండల బీ ఆర్ ఎస్   పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ లు ఆమెను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదివి దేశంలో మన రాష్ట్రానికి
మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో సుహనాకు తమంత అండగా ఉంటామని తెలిపారు. వారి వెంట బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాముల భాను, ఆర్ఎంపీ డాక్టర్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.