- మే డే స్ఫూర్తి కి విగాథం కల్పించే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి.
- మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ పని గంటల.
- 282 జీఓ ను వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వ పై పోరు తప్పదు.
- కార్మిక సంఘాల నాయకుల డిమాండ్.
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: ఎనిమిది గంటల పని నుండి 10 గంటలకు పెంచుతూ తెచ్చిన జీవో నెంబర్ 282 ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జిల్లా నాయకులు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కృష్ణపురం లక్ష్మణ్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి మంచే నర్సింహులు, హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదారి మల్లేశం లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 5. 7.2025వ తేదీ నాడు జీవో నెంబర్ 282 తెస్తూ ఎనిమిది గంటల పనిని 10 గంటలకు వాణిజ్య సముదాయంలో కార్మికులు పనిచేయాలని సర్కులర్ జారీ చేయడం జరిగింది. అట్టి సర్కులర్ కాపీలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 1886లో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కావాలని పోరాటం చేసి ఎందరో ప్రాణ త్యాగం చేసిన ఫలితంగా వచ్చినటువంటి ఎనిమిది గంటల పని చట్టం నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుపరిచి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి 29 రకాల కార్మిక చట్టాలను రద్దుపరిచి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నాటి బానిస వ్యవస్థ ను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మలిచేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. నాటి 29 రకాల చట్టాలను తిరిగి తీసుకురావడానికి ఒకవైపు కార్మిక సంఘాలు జులై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె సిద్ధమవుతుంటే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో పాలన నిర్వహిస్తున్నమని చెప్పి నేడు కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురి చేసే విధంగా పని గంటల్లో మార్పు చేసి 8 గంటల నుండి 10 గంటల వరకు కార్మికులు పనిచేయాలని కోరుతూ 282వ జీవో నోటిఫికేషన్ ఇవ్వడం మోడీ విధానాలకు వత్తాసు పాలకడమే అని అన్నారు. నాడు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని మేడే స్ఫూర్తి కి విగాథం కలిగించే పద్ధతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఉందని అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అనుబంధ కార్మిక యూనియన్ ఐ ఎన్ టి యు సి సమ్మెలో ఉండగానే మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వైఖరి తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ద్వందనీతికి నిదర్శనం అని వారన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి ఎనిమిది గంటల పని నుండి పది గంటలకు పెంచేటువంటి జీవన వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై కార్మిక వర్గం కన్నెర్ర చేసి పోరాటాలకు సన్నద్ధమవుతుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ జీవో కాపీ దగ్ధం చేసిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి బెక్కంటి సంపత్, బి ఆర్ టి యు జిల్లా కార్యదర్శి బండారి నరసింహులు బి ఆర్ టి యు నాయకులు శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి శశిధర్, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి ఆలేటి యాదగిరి డివైఎఫ్ఐ జిల్లా బాధ్యులు దాసరి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.