Take a fresh look at your lifestyle.

ఎట్టకేలకు కోర్టు జోక్యంతో అరవ పెళ్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ ఎంపిక

  • దేవాలయ చైర్మన్ గా అని రెడ్డి రాజేందర్ రెడ్డి.

ముద్ర,తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గం లోని అరవపెల్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ చైర్మన్ ఎన్నిక కోర్టు జోక్యంతో శనివారం ముగిసింది. చైర్మన్గా అని రెడ్డి రాజేందర్ రెడ్డి తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా దేవాలయ డైరెక్టర్లు 8 మంది ఎన్నిక కాగా వారిలో ముగ్గురు గైర్హాజర్ కావడం ఐదుగురు హాజరు కావడంతో చైర్మన్ ఎన్నికకు కోరం పూర్తి కావడంతో ఆలయ ఇన్స్పెక్టర్ సునీత, ఈవో శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరిగింది.ఈ సందర్భంగా నూతన చైర్మన్గా ఎంపికైన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీనియర్ న్యాయవాది ధరూరి యోగానంద చారి మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చైర్మన్గా రాజేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం హర్షణీయమని అన్నారు.దేవాలయ అభివృద్ధికి తమ వంతు కృషి అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఆకుల సోమయ్య, శ్రీధర్ రెడ్డి ,జేరిపోతుల సోమయ్యలతోపాటు దేవాలయ అర్చకులు అర్వపల్లి రాంబాబు, పవన్, పిసిసి మహిళా ఉపాధ్యక్షురాలు బోయినపల్లి రేఖ, మడ్డి పద్మ, నర్సింగ్ శ్రీనివాస్, మోరపాక సత్యం ,శివ నజీర్, రాంబాబు, కృష్ణమూర్తి తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.