ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.01 కోటి 01 లక్ష 24 వేల 258 రూపాయలు వచ్చింది. శుక్రవారం కొమురవెల్లిలోని ఆలయ ముఖ మండపంలో ఈఓ టీ.వెంకటేష్ ఆధ్వర్యంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ పీ.విజయ లక్ష్మి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లికార్జునస్వామి దేవస్థానంలో 23 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించగా రూ. 01 కోటి 01 లక్ష 24 వేల 258 నగదు, విదేశీ కరెన్సీ 30 నోట్లు, మిశ్రమ బంగారం 50 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 600 గ్రాములు రాగ వచ్చిన మొత్తం డబ్బులను స్థానిక SBI బ్యాంకులో జమ చేసినట్లు ఆలయ ఈఓ టీ.వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మల్లికార్జున్, మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్ గంగం నర్సింహ్మరెడ్డి, ధర్మకర్తలు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, చిగురు కొమురయ్య, అర్చకులు, ఆలయ సిబ్బంది, శ్రీ లలిత సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. కాగా కొమురవెల్లి ఎస్ఐటీ మహేష్ పోలీస్ సిబ్బందితో బందోబస్త్ నిర్వహించారు.