Take a fresh look at your lifestyle.

సింగరేణి టెండర్లపై విజిలెన్స్ విచారణ జరపాలి – సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్

 

2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ‌లో బొగ్గు టెండర్లు… తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై విచారణ జరిపి.. జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెట్టాల‌ని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో కీలకంగా ఉన్నారన్నారు. ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ కూడా ఆయ‌న ప‌రిధిలోకే వ‌స్తుంద‌ని చెప్పారు. వెంట‌నే విజిలెన్స్ తో విచార‌ణ జ‌రిపించి… సింగ‌రేణిలో జరిగిన అవినీతిని బ‌య‌ట‌పెట్టాల‌ని కిష‌న్ రెడ్డిని డిమాండ్ చేశారు. శాఖలో ఏ అవినీతి జ‌రిగింది..? ఏ కుంభ‌కోణాలు జ‌రిగాయో మీ వ‌ద్ద ఉండే అధికారుల‌తో విచార‌ణ జ‌రిపి రిపోర్టును సీబీఐకి అప్ప‌గించాల‌న్నారు. ఉద‌యం లేస్తే ప‌నికిరాని ఆరోపణలతో ప్రజల దృష్టిమరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముందు తెలంగాణ‌కు రావాల్సిన బ‌కాయిల‌ను, నిధుల‌ను తీసుకురావాల‌ని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్ర‌పంచంలో ఆర్మీ త‌ర‌్వత అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ప‌నిచేసేది సింగ‌రేణి కార్మికులేన‌ని వాళ్లు క‌ట్టే ఆస్తిపన్నును మాఫీ చేయించాల‌ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.