- స్వామి వారి ఉత్సవ ముర్తుల ఉరేగింపు
- అలయకమిటీ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
- సీతారాముల వారికి ఓడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు
- ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
మెట్ పల్లి, ముద్ర: మెట్ పల్లి శ్రీ కోదండ రామాలయం లో ఆదివారం రోజు శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమం ఖాదీ హనుమాన్ ఆలయం నుండి శ్రీరాములవారిని ఎదుర్కోలుగా తీసుకువచ్చి శ్రీ కోదండ రామాలయం లో ఘనంగా కళ్యాణ మహోత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యలుగా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ , మాజీ ఎమ్మెల్యే, ఖాదీ బోర్డు చైర్మన్ దంపతులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సరోజినమ్మ ఎస్సారెస్పీ అధికారి శ్రీనివాస్ చారి దంపతులు, ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ దంపతులు,ఆలయ కమిటీ నిర్వాహకులు మహాజన్ నర్సింలు దంపతులు కళ్యాణ వేదికలో పాల్గొనగా కమిటీ సభ్యులు హనుమాన్ భక్త స్వాములు పట్టణ గ్రామీణ ప్రజలు కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వామివారి కల్యాణ అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు .
- మెట్ పల్లి మండలం లో..
మండలం లోని వేంపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది శ్రీ రామకృష్ణ సంకీర్తన మండలి 56వ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలతో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొనగా పురోహితుల వేదమంత్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది .వేంపేట గ్రామ ప్రజలు పరిశర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు పొందారు అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు.
- ఇబ్రహీంపట్నం మండలం లో…
కమనీయం రమణీయంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో శ్రీసితరామలక్ష్మణ బలంజనేయస్వామి,ఎర్దండీ లో నుతనంగా నిర్మించిన రామలయం లో, వర్షకోండ లో పంచముఖ అంజనేయస్వామీ అలయం లో , ఇబ్రహింపట్నం లో కోదండ రామలయం లో ,అమ్మక్కపెట్ గ్రామంలో రామస్వామి గుట్ట అలయం లోని గ్రామాలలో అదివారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ,గ్రామ అభివృద్ధి కమిటీ ల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక మండపంలో సీతారాముల వారి కళ్యాణం అలయ అర్చకులు వేదమంత్రోత్సరణ మధ్య నిర్వహించారు. కళ్యాణం అనంతరం మహిళలు ఓడిబియ్యాన్ని సమర్పించుకున్నారు.అయా గ్రామలలో భక్తులు స్వామి కీ ప్రత్యేక మెక్కులు చెల్లించుకున్నారు. అలయకమిటీ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు.స్వామి వారిని అంజనేయస్వామీ భక్తులు, అయాగ్రామస్తులు పల్లకి సేవ,శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆంజనేయ స్వామి దీక్ష భక్తులు, హిందు ఉత్సవ కమిటీ సభ్యులు,మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.