ముద్ర, కుత్బుల్లాపూర్ :
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సూరారం మెయిన్ రోడ్డు ఎమ్మార్పీఎస్ జెండా ఆవరణలో మాదిగ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎంఎస్పీ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు రాస మల్ల యాదగిరి మాదిగ ఘనంగా నివాళులు అర్పించారు.వారు మాట్లాడుతూ మాదిగ అమరవీరులు ప్రాణత్యాగం వృధా కాలేదు వారి ఆశయ సాధనలో 30 ఏళ్ల సుదీర్ఘ అలుపెరగని పోరాటం వల్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించి పెట్టడం జరిగిందన్నారు.అలాగే ప్రజా సమస్యలు ఎలాంటి ఉన్న ముందుండే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేశారుఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంఘీ మహేష్ మాదిగ కనుమూరి కుర్మయ్య మాదిగ గడ్డం కురుమయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.