Take a fresh look at your lifestyle.

ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొనుగోలు చేసే ముందే నాణ్యతను పరిశీలించాలి: మహిళా సాధికారత, మహిళాభ్యుదయం కార్యక్రమంలో డాక్టర్లు

ముద్ర, శేరిలింగంపల్లి:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సి.ఆర్ ఫౌండేషన్-మహిళా సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్ లోని సి.ఆర్ ఫౌండేషన్ ఇంద్రజిత్ గుప్తా హాల్లో మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది.
మహిళా సంక్షేమ కేంద్ర డైరెక్టర్ జ్యోస్యబట్ల కల్పన అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పిల్లల వైద్య నిపుణురాలు, మాగ్నా సెంటర్ ఫర్ ఒబేసిటీ, డయాబెటిక్ మరియు ఎండోక్రైనాలజీ డాక్టర్ శివరంజని సంతోష్ మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్రాముఖ్యతను మార్కెట్ మోసాలను వివరించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.


తల్లిదండ్రులు ఇప్పుడు కొనుగోలు చేసే ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ వో ప్రమాణాలకు అనుగుణంగా మరియు ప్రసిద్ధి చెందిన ఫార్మసీలు లేదా ఆసుపత్రుల నుండి వస్తాయా లేదా అని నిర్ధారించుకోవాలని సూచించారు. ఉస్మానియా మెటర్నిటీ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ డి.ప్రతిభ గౌరవ అతిథి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారనే విషయం మరవకూడదని, కుటుంబం ఆరోగ్యంగా సాగాలంటే మహిళే కారకురాలు అని గుర్తుచేశారు. కార్యక్రమం మొదట సి.ఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ఫౌండేషన్ ప్రాముఖ్యతను, ఫౌండేషన్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం, మహిళా సంక్షేమ కేంద్రం, ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్, సురవరం సుధాకర్ రెడ్డి లైబ్రరీ, చిల్డ్రన్స్ లైబ్రరీ, సి.ఆర్ పాలిక్లినిక్ మరియు డైగ్నోస్టిక్ సెంటర్లను గురించి వివరించారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. డాక్టర్ శివరంజని, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ అరుణ, డాక్టర్ కే.రజని, జోస్యభట్ల కల్పన, టి.ఎం ఉషా రాణి, నలిని, వి.లలిత, వి.లక్ష్మి, మమత, అరుణకుమారి, జోస్త్న, విజయలక్ష్మి, పల్లా విజయ, టీచర్స్, వర్కర్స్, కమిటీ మెంబర్స్ కు ఈ సందర్భంగా సన్మానం చేశారు. ఇటీవల పలు కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానం చేశారు. మహిళా సంక్షేమ కేంద్ర విద్యార్థులు తమ పాటలతో అలరించారు. తొలుత వంకా లక్ష్మి వేదిక పైకి అతిథులను ఆహ్వానించగా, మహిళా సంక్షేమ కేంద్ర కమిటీ సభ్యులు వి.లలిత వందన సమర్పణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.