Take a fresh look at your lifestyle.

ప్రజావాణి ఆర్జీలకు సత్వర పరిష్కారం అధికారులకు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అదేశం

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి  అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అందజేసిన అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి  స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖవి –19, ఇతర శాఖలవి –80, మొత్తం 99 దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.