ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగిత్యాల పిడి రఘు వరణ్ కు గడ్డం రమేష్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు వినతి పత్రం ఇచ్చారు. పీడీ స్పందిస్తూ సంబంధిత కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే జీతాలు వచ్చేలా చూస్తానని తెలియజేశారని రమేష్ తెలిపారు.ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ ప్రతి రోజు జాబ్ కార్డు కలిగిన కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లి పనులు చేస్తూ, రికార్డులు రాస్తూ ప్రభుత్వ పథకాన్ని సాధ్వినియోగం చేయడానికి ఎండకు, వానకు, చలిని భరిస్తూ గుట్టల్లో, చెరువుల్లో, కుంటల్లో బాధ్యతగా పనిచేయిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకుని వెంటనే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్నం రాజా గౌడ్, గోనపల్లి మహేష్, లక్మన్, తిరుపతి, రేవతి, జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.