ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల కోసం నిర్మల్ ఈద్గా పూర్తి వసతులతో సిద్ధం చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్న పనులను పలువురు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన ఈద్గా ప్రత్యేక ప్రార్థనలకై మున్సిపల్ శాఖ పరంగా ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్ శాఖ ఇప్పటికే ఏర్పాట్ల పనులు ప్రారంభించిందన్నారు. ఈద్గా వద్ద సానిటేషన్, టెంట్, సౌండ్ సిస్టమ్, కార్పెట్ లు, వేసవి కాలం నేపథ్యంలో మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, ముజహిద్, రఫీ, జకీ, ఇర్ఫాన్, కత్తి నరేందర్, అడప పోశెట్టి, గోపు గోపి, తదితరులు పాల్గొన్నారు.