Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులసంఖ్య ఎక్కువ చేయాలి

  • అచ్చంపేట ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ల గత ఐదు రోజుల నుండి నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే దిశ గా ఉపాధ్యాయులు కృషి చేయాలని, దీని కోసం ఉపాధ్యాయులు నాణ్యమైనవిద్యను అందించడమే ప్రధాన లక్ష్యం అని అన్నారు.విద్యార్థులకు పాఠశాల ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు దుస్తులు అన్ని ప్రభుత్వం సమకూర్చడం జరుగుతుందనీ శిక్షణ పొందిన ఉపాధ్యాయులందరూ కూడా శిక్షణలో భాగంగా నేర్చుకున్నటువంటి నైపుణ్య అంశాలను విద్యార్థులకు మరింతగా చేరవేసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.ఉపాధ్యాయులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టి విద్యను అందరికీ అందే విధంగా కృషి చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగ తి గదిలో వినియోగించడం, మౌలిక భాష, గణిత అభివృద్ధి కార్యక్ర మాన్ని కృత్రిమ మేధా ఆధారంగా అభివృద్ధి పరచడం, పాఠశాల విద్య లో నూతనంగా ప్రవేశ పెట్టబడుతున్న కృత్రిమ మేధా పాఠ్యాంశాలను పిల్లలకు అందించడం అనే మూడు నూతన విషయాలతో ఎఫ్‌ఎల్‌ ఎన్‌ శిక్షణ రూపొందించ బడిందని దీన్ని ఉపాధ్యా యులు అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాల విద్యా భివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ జీవన్ కుమార్, మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్ గౌరీ శంకర్, మరియు , ఉపాధ్యాయులు సిఆర్పిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.