Take a fresh look at your lifestyle.

“మూడో మహాసభను జయప్రదం చేయాలి”

రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి: క్యాతన్ పల్లిలో నిర్వహించే మూడో మహాసభను జయప్రదం చేయాలని పట్టణ సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రాజీవ్ చౌక్, బీజోన్ సెంటర్ చౌరస్తాలలో మహాసభకు సంబంధించిన కరపత్రాలను పార్టీ ప్రజా సంఘాల నాయకులు పంపిణీ చేశారు. జూన్ ఒకటో తేదీ ఉదయం స్థానిక రాజీవ్ చౌక్ నుంచి సూపర్ బజార్ మీదుగా సిఈఆర్ క్లబ్ వరకు మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్,వెంకటస్వామి,పౌల్,గోపి,శంకర్,రాములు,రాయలింగు,కొమురయ్య,రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.