ముద్ర కూకట్‌పల్లి :
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కూకట్‌పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టి పి సి సి ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన వారికి బండి రమేష్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని కొనియాడారు.
అర్హులైన ప్రతి పేద మహిళా కుటుంబానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, భవిష్యత్తులో మరింత మంది పార్టీలో చేరుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, నాయకులు లక్ష్మయ్య, కేపీహెచ్‌బీ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్, మహిళా అధ్యక్షురాలు సంధ్య, రజితతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post