శిక్షణా తరగతులలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి … కార్యక్తర్తలకు పిలుపునిచ్చిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ముద్ర, శేరిలింగంపల్లి:
శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా మాతృ శ్రీ నగర్ వద్ద గల కాలేజీలో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మాహాభియన్ 2026 ముగింపు కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, దేశ చరిత్ర, నాయకత్వ లక్షణాలు, మరియు సమాజ సేవలో ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవచ్చని, మంచి నాయకుడిగా ఎదగాలంటే సరైన శిక్షణ కూడా అవసరమని, కార్యకర్తలకు, నాయకులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇచ్చేది దేశంలో ఒక్క బీజేపీ పార్టీనేనని గుర్తుచేశారు. 14 కోట్ల సభ్యత్వం, 7,60,000 వేల బూత్ కమిటీలు, 17000 మండల కమిటీలు, 960 పైగా జిల్లా కమిటీలు, 33 రాష్ట్రాల అధ్యక్షుల నియామకం, కమిటీల నిర్మాణం పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, అందుకు కారణం కార్యకర్తలు మాత్రమేనని, నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజాభివృద్ధి కోసం కృషి చేసే నిబద్ధత గల కార్యకర్తలు బిజెపి సొంతమని కొనియాడారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి ఆలె భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, ఇంట్లెక్టువల్ సెల్ కన్వీనర్ బాల్దా అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన వ్యక్తిత్య నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం, జాతీయత నిర్మాణం, దేశ నిర్మాణం జరుగుతుందని నమ్మే ఏకైక పార్టీ బీజేపీ, నేర్చుకున్న ప్రతి అంశం మనకు మార్గనిర్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నరేష్ యాదవ్, అనిల్ గౌడ్ ఉపాధ్యక్షుడు, రాధాకృష్ణ యాదవ్, స్రవంతి, దుర్గాప్రసాద్, మాణిక్ రావు కృష్ణంరాజు, బుచ్చిరెడ్డి, గోవర్ధన్ గౌడ్, వసంత్ యాదవ్, పద్మ, ఎల్లేష్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.