ముద్ర ప్రతినిధి ఖమ్మం, 10 : ఖమ్మం మమత రోడ్ లో విజేత సూపర్ మార్కెట్ నువ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. 1999 లో సూపర్ మార్కెట్ రంగంలో మొదటి బ్రాంచ్ స్థాపించి, నేడు “విజేత సూపర్ మార్కెట్ ” ఒక బ్రాండుగా నిలిచిందని తుమ్మల కొనియాడారు. 27సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వినియోగ దారులకి, నిత్యావసర వస్తువులతో అత్యున్నతమైన నాణ్యమైన సేవలు అందించిన విజేత ఇప్పుడు మన ఖమ్మం లో 117వ శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
విజేత సూపర్ మార్కెట్స్ ఛైర్మెన్ మురకొండ జగన్మోహన్ రావు మాట్లాడుతూ తమను నమ్మిన మా కస్టమర్ లకు, ఖాతాదారులకు, అండగా నిలిచినా డిస్ట్రిబ్యూటర్స్ కు కృతఙ్ఞతలు తెలిపారు. విజేతలుగా మా ప్రయాణం లో నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన నా కుటుంబ సభ్యులకు, ఉద్యోగ సహచరులకు ప్రత్యేక ధన్యవాదములుతెలిపారు.
ప్రతి జిల్లా కేంద్రంలో మార్ట్ విస్తరిస్తామని, కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తామని జగన్ మోహన్ రావు అన్నారు. ఈ సహకారం ఎప్పటికి కోరుతూ, మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు అండగా ఉండాలని విజేత సూపర్ మార్కెట్ చైర్మన్ కోరారు.
కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణవేణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురకొండ సందీప్ చౌదరి, రాజ్యలక్ష్మి,మార్కెటింగ్ డైరెక్టర్ సిధార్థ, సిబ్బంది పాల్గొన్నారు