Take a fresh look at your lifestyle.

మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆకట్టుకున్న వైబ్రన్స్ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో వైబ్రన్స్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి.విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి ఉట్టి పడేవిధంగా, జనపద నృత్యాలు గ్రామీణ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాయి. పులి వేషధారణతో డప్పు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలు, ఎల్లమ్మ నృత్యం,కొయ గీతాలు, లంబాడి నృత్యాలు–గిరిజన జీవన శైలిని ప్రతిబింబించే అద్భుత ప్రదర్శనలు చేశారు.ఈ సందర్భంగాపాఠశాల ప్రిన్సిపాల్ రజితరావు మాట్లాడుతూ వైబ్రన్స్ 2కే25 లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకతను, బహుళ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని, విద్యతో పాటు వారు తమ సంస్కృతిని అర్థం చేసుకొని, ప్రపంచ స్థాయిలో తమ కీర్తిని చాటుకునేలా తయారవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ మంజుల రామదేవి, ప్రిన్సిపాల్ రాజితారావు, డైరెక్టర్లు శ్రీధర్ రావు, హరిచరణ్ రావు, మౌనికా రావు, సుమన్ రావు,సీనియర్ పాత్రికేయుడు సిరిసిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.