Take a fresh look at your lifestyle.

అంకితభావంతో పనిచేయాలి – జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ బదిలీల్లో భాగంగా జిల్లాకు కేటాయించబడిన నూతన ఎస్సైలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

వీరిలో తెల్కపల్లి నూతన ఎస్సై రమేష్, వంగూరు ఎస్సై మాధవరెడ్డి, ఉప్పునుంతల ఎస్సై మహేష్, బిజినపల్లి ఎస్సై శంషుద్దీన్, తిమ్మాజీపేట ఎస్సై శ్రీనివాసరావులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ అధికారులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు. నిజాయితీతో విధులు నిర్వహిస్తూ బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు చేరువగా ఉండి సేవా దృక్పథంతో పనిచేయడం ద్వారా పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.