Take a fresh look at your lifestyle.

స్థలం సాకుతో కేంద్రీయ విద్యాలయం తరలించే ఆలోచన చేయవద్దు..ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

జగిత్యాలపై కనీస అవగాహన లేక అహంకారంతో మాట్లాడుతున్నారు…
అభివృద్ధికి నిధులు కోరితే ముఖ్యమంత్రిని బిచ్చగాడు అని అంటారా?
జగిత్యాల అభివృద్ధిపై ఎంపీ దృష్టి పెట్టాలి…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

కేంద్రీయ విద్యాలయంను స్థలం సాకు చూపి ఎంపీ అరవింద్ జగిత్యాల నుంచి తరలించే ఆలోచన చేయవద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎంపీ అరవింద్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఫెడరల్ స్ఫూర్తి లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు కోరడంలో తప్పేముందని, నిధులు కోరితే ముఖ్యమంత్రిని బిచ్చగాడు అని అంటారా? ఇలాంటి వాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. గత 5 ఎండ్ల లో తెలంగాణ రాష్ట్రం GST రూపం లో కేంద్రానికి 2 లక్షల కోట్ల పైగా ఇస్తే కేంద్రం మాత్రం 85 వేల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీకి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రిని కేంద్రీయ విద్యాలయం స్థలం విషయంలో కలవాల్సిన బాధ్యత ఎంపీకి ఉందని, నేను అనేక సార్లు కలిసి 5 ఎకరాలు కేటాయించాలి అని వినతి పత్రాన్ని అందజేశానన్నారు. కేంద్రీయ విద్యాలయం స్థలం సేకరణ లో ఎమ్మెల్యే అసమర్థ అంటే, నేను జగిత్యాల నియోజవర్గానికి అవసరమైన జాతీయ రహదారులు, బ్లాక్ స్పాట్ రోడ్డులు, వంతెనలు, జగన్నాద్ పూర్ బ్రిడ్జి నిధులు మంజూరు చేయాలని ఎంపీ అరవింద్ కి, కేంద్ర మంత్రులకు వినతులు ఇస్తే ఇప్పటి సమాధానం లేదని ఇది అసమర్థత కాదా? అని ప్రశ్నించారు. చల్గల్ లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చిత్తశుద్ధి తో ఉన్నానని, వాలంతరి అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అని, సంస్థ అభివ్రుద్ది పై ఎప్పుడైనా ఆలోచన చేశారా? మండిపడ్డారు. టి ర్ నగర్ లోని టీచర్స్ కాలని దగ్గర జాతీయ రహదారి కి 200 మీటర్ల దూరంలో 6 ఎకరాల స్థలం సిద్ధంగా ఉందని, జగిత్యాల నియోజకవర్గం పై కనీస అవగాహన లేకుండా అహంకారంతో మాట్లాడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్ తో రాజకీయం వద్దని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గం లో అన్ని ఆలయాలకు నిధులు కేటాయించానని, కుల, మత రాజకీయాలు నాకు అలవాటు లేదన్నారు. నేడు రాష్ట్రములో అతి పెద్ద సమస్యగా మారిన వడ్లు, మక్కల కొనుగోలు FCI ధాన్యం సేకరణ లో జాప్యం వల్లనే రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీ, బీజేపీ అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం మక్కలు కొనట్లేదని గుర్తు చేశారు. గడిచిన 6 నెలల్లో FCI ద్వారా ఎంత ధాన్యం సేకరణ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం మద్దతు ధర పెంచి చేతులు దులుపుకుంటుందన్నారు. మామిడి మార్కెట్ కోసం వాలంతరీ భూమి 10 ఎకరాలు ఇస్తే ముస్లిం లకు ఇచ్చారు అని అంటారా? అక్కడ 90 శాతం మామిడి అమ్మే రైతులు హిందువులు కాదా, హిందూ వ్యాపారులు లేరా? అని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ జగిత్యాల పై దృష్టి పెడతా అంటే మంచిదని, జాతీయ రహదారి వంతెనలు, జగన్నాద్ పూర్ బ్రిడ్జి, బ్లాక్ స్పాట్ రోడ్డులు పూర్తి అయ్యే విధంగా నిధులు మంజూరు పై దృష్టి సారించాలని అన్నారు. నాయకుల ప్రవర్తన, చేసే అభివ్రుద్దిని ప్రజలే చూస్తారని, అంతిమంగా తీర్పు చెప్పేది ప్రజలే అని, ఒకరినీ టార్గెట్ చేయడం నాయకుల చేతిలో ఉండదని, ప్రజల చేతిలో ఉంటుంది అని అన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, డిపిసిసి సెక్రటరీ బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు నాగభూషణం, గోలి శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ కొలుగోరి దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, నాయకులు గట్టు సతీష్, ముజీబ్ బాషా, అడువాల లక్ష్మణ్, బాల ముకుందం, కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.