Take a fresh look at your lifestyle.

రజితోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ

రామకృష్ణాపూర్, ముద్ర విలేఖరి : భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల రజితోత్సవ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.శనివారం క్యాతన్ పల్లి ఆయన నివాసంలో 27 వ తేదీన వరంగల్ వేదికగా జరిగే బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెన్నూరు నియోజవర్గవ వ్యాప్తంగా 60 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఒక్కో బస్సుకు ఒక్కో ఇన్చార్జులను నియమించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా రమేష్,పల్లె భూమేష్,వాలా శ్రీనివాసరావు,రిక్కుల మధుకర్ రెడ్డి,బడికల సంపత్,సుదర్శన్ గౌడ్,సూరి బాబు,వేల్పుల రవి, రామ్ లాల్ గిల్దా పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.