కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం భక్తి, సేవ, సమర్పణకు ప్రతీకగా విశేషంగా ఆకట్టుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ పవిత్ర కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ డా. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి విచ్చేసారు. ముందుగా ఆలయ అర్చకులు పాలెపు కార్తీక్ భరద్వాజ్ శర్మ వైదిక నిర్వహణలో గోపూజ, అన్నపూర్ణ మాత పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. అనంతర కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “అన్నదానం అన్నింటిలోకెల్లా శ్రేష్ఠమైన దానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే దేవునికి నైవేద్యం సమర్పించినట్లే అని అన్నారు.
అమావాస్య రోజున చేసే ఈ సేవ పితృదేవతలను సంతృప్తి పరచి, కుటుంబాలకు శాంతి, శ్రేయస్సు తీసుకొస్తుంది” అని అన్నారు. వారి ఈ సందేశం భక్తులలో సేవాభావాన్ని మరింత పెంపొందించింది. అన్నపూర్ణ మాత ఆశీస్సులతో అన్నప్రసాద వితరణ ప్రారంభమై, సుమారు 1200 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. “ఎవరూ ఆకలితో ఉండకూడదు” అనే మహత్తర సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, పితృదేవతల తృప్తికి అంకితమై సమాజంలో సేవా స్పూర్తిని మరింత బలపరిచింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, రేగుంట రాజారాం, అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద సేవ కమిటీ చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, గంప శివకుమార్, మంచాల రమేష్, కమిటీ సభ్యులు శ్రీపతి రమేష్, మహాదేవ స్వామి ఆలయం అధ్యక్షులు చెన్నవేని రాములు, తదితరులు పాల్గొన్నారు.“అమావాస్య రోజున అన్నదానం పరమోత్తమం”
బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి….
కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం భక్తి, సేవ, సమర్పణకు ప్రతీకగా విశేషంగా ఆకట్టుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ పవిత్ర కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ డా. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి విచ్చేసారు. ముందుగా ఆలయ అర్చకులు పాలెపు కార్తీక్ భరద్వాజ్ శర్మ వైదిక నిర్వహణలో గోపూజ, అన్నపూర్ణ మాత పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. అనంతర కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “అన్నదానం అన్నింటిలోకెల్లా శ్రేష్ఠమైన దానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే దేవునికి నైవేద్యం సమర్పించినట్లే అని అన్నారు.
అమావాస్య రోజున చేసే ఈ సేవ పితృదేవతలను సంతృప్తి పరచి, కుటుంబాలకు శాంతి, శ్రేయస్సు తీసుకొస్తుంది” అని అన్నారు. వారి ఈ సందేశం భక్తులలో సేవాభావాన్ని మరింత పెంపొందించింది. అన్నపూర్ణ మాత ఆశీస్సులతో అన్నప్రసాద వితరణ ప్రారంభమై, సుమారు 1200 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. “ఎవరూ ఆకలితో ఉండకూడదు” అనే మహత్తర సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, పితృదేవతల తృప్తికి అంకితమై సమాజంలో సేవా స్పూర్తిని మరింత బలపరిచింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, రేగుంట రాజారాం, అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద సేవ కమిటీ చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, గంప శివకుమార్, మంచాల రమేష్, కమిటీ సభ్యులు శ్రీపతి రమేష్, మహాదేవ స్వామి ఆలయం అధ్యక్షులు చెన్నవేని రాములు, తదితరులు పాల్గొన్నారు.