Take a fresh look at your lifestyle.

బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగించొద్దు : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని రైతుల వ్యవసాయ పొలాల మధ్యన నుంచి బస్వాపురం ప్రాజెక్టు నుండి ఇతర ప్రాంతాలకు నీళ్లు వెళ్ళడానికి తవ్విన కాలువను రాకపోకలు కొనసాగించడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలువలో ఉన్న పైపులను తొలగించాలన్న ప్రతిపాదనను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, అధికారులు వెంటనే విరమించుకోవాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగిస్తే గ్రామ ప్రజలందరితో కలిసి కాలువను పూడ్చడానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించినారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని, కాలువలో ఉన్న పైపులను అక్రమంగా తొలగించవద్దని గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులతో కలిసి కాల్వ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ రాంపల్లి కృష్ణ , మాకోల్ల సత్యం మాట్లాడుతూ ఇప్పటికే చాలామంది రైతులు కాలువ కోసం తమ భూములను కోల్పోయినారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గ్రామ ఉప సర్పంచ్ అందె మల్లేశం, వార్డు మెంబర్లు జక్కుల మల్లేశం, కొండమడుగు అశోక్, గజ్జి కవితా కుమార్, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండా అశోక్, సిపిఎం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.