Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిలోమీటర్ల పరుగు.. కొండ కింద కళ్యాణ కట్టలో స్వచ్ఛ భారత్

ముద్ర, యాదగిరిగుట్ట :

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. అనంతరం కొండ కింద ఉన్న కల్యాణకట్ట వద్ద ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ ఈవో భవాని శంకర్, ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కే. శేషగిరి రావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా
తరలించారు. ఎస్సై రవి, ఏఎస్ఐలు శ్రీనివాస్ రెడ్డి, రాజయ్య, నాగేశ్వరరావు, సిబ్బంది మోహన్ రెడ్డి, రామ్మోహన్ రావు, గోపి నాయక్, రమేష్, సిద్ధులు, పాండు, సూరి నాయక్, మురళి, ధర్మేష్, తిరుపతి, సునీల్, యాదగిరి, కృష్ణ అనిల్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.