Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో డాక్టర్, మెడికల్ సిబ్బంది అందరూ వచ్చారా లేదా అని హాజరు రిజిస్టర్ పరిశీలించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈరోజు ఓ.పి కి ఎంత మంది వచ్చారని ఆరా తీసి వారు ఏ సమస్య తో వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషంట్లలో ఎక్కువగా ఏ సమస్య పై వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరైన మందులు అన్ని సరిపోను అందుబాటులో ఉన్నాయ అని అడిగి, అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గత నెలలో ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరిగాయని, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని అయ్యాయని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారని గర్భిణీలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో ఇటీవల నార్మల్ డెలివరీ జరిగిన గర్భిణి స్త్రీ కి కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది, ఎంత బరువు లో పుట్టారు, ఆసుపత్రి లో డాక్టర్, సిబ్బంది వైద్య చికిత్సలు అన్ని మంచిగా చేసారా అని అడిగి తెలుసుకున్నారు. అప్పుడు గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రి లో మంచి వైద్య సేవలు అందిస్తున్నారని , ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.