Take a fresh look at your lifestyle.

జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి – సరిత దంపతులు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, సరిత దంపతులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గురువారం జరుపుకోనున్న తెలుగు నూతన సంవత్సరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలోని ఆరు భావాలను సూచిస్తాయని తెలిపారు. తీపి, చేదు, వగరు, పులుపు వంటి రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అని, ఇది మన జీవితంలో ఎదురయ్యే విభిన్న అనుభవాలను ప్రతిబింబిస్తుందని వివరించారు.

తెలుగు ప్రజలకు ఉగాది పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొంటూ, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జీవనం సాగించాలని, ప్రతి ఇంటా శుభాలు కలగాలని, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.