సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
సిద్దిపేట జిల్లాలో పిఎం శ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేస్తున్న సైన్స్ ల్యాబ్స్, మరుగుదొడ్లు, భవిత కేంద్రాలు పనులలో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో పిఎం శ్రీ పథకం కింద జిల్లాలో పలు ప్రభుత్వ విద్యాలయాల్లో చేపడుతున్న పనుల పురోగతి గూర్చి జిల్లా విద్యాశాఖ, ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో పిఎం శ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేస్తున్న సైన్స్ ల్యాబ్స్, మరుగుదొడ్లు, భవిత కేంద్రాలు పనులలో వేగం పెంచాలని సూచించారు. ఆయా స్థాయిలో నిర్మాణ పనులను పూర్తి చేసుకుని వెంటనే బిల్లు అప్లోడ్ చెయ్యాలని తెలిపారు. సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో 22 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో చేపడుతున్న పనులు సైతం 100 శాతం పనులు పూర్తి చెయ్యాలని ఆయా స్థాయిలో ఉన్న నిర్మాణాలు బిల్లులు అప్లోడ్ చెయ్యాలని, ప్రతి నిర్మాణం నాణ్యత చాలా ముఖ్యం అని కాంట్రాక్టర్ లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాల వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి రామస్వామి, ఈడబ్ల్యుఐడీసీ ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.