Take a fresh look at your lifestyle.

సేవాలాల్ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

గిరిజనులకు అండగా ప్రభుత్వం

ముద్ర ప్రతినిధి, మెదక్:
గిరిజనులకు, లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డా: మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
మెదక్ పట్టణంలో సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ… ఆదివాసీలకు,గిరిజనులకు, లంబాడాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మెదక్ నియోజకవర్గంలోని తండాల్లో వివిధ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ 8 కోట్లు ఖర్చు చేసి అబివృద్ధి పనులు చేశామన్నారు. మరింత గిరిజనుల, లంబడాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు.
లంబాడా వేషధారణలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కనుగుల రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఆర్డీవో రమాదేవి,
గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, కల్కి మహరాజ్, భిక్షూ మహరాజ్, కౌన్సిలర్ సంధ్య, చంద్రం, గోపాల్ నాయక్, కిషన్, దేవుల, హీరాలాల్, అశోక్, శ్రీను నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
జ్ఞానజ్యోతిని వెలిగించిన గురువు:కలెక్టర్


బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేశారు.. బంజారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని గుర్తు చేశారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ, దేశమంతా సంచరిస్తూ, హితబోధ చేశారన్నారు. దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారన్నారు.
బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన మహానీయుడని కొనియాడారు. బంజారా సంఘం పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.