Take a fresh look at your lifestyle.

శివాజీకి పూలమాల వేసిన ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ పట్టణంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాందాస్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రామాలయం నుండి యువకులు పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక, ఆర్ఎస్ఎస్ నగర సంగచాలక్ డాక్టర్ ఇప్ప భానుచందర్, శివాజీ కమిటీ అధ్యక్షులు మాయ శంకర్, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాయిని ప్రసాద్, కార్యదర్శి సునీల్, పరశురాం, పృథ్వి, చెన్న రామచందర్, జగదీష్, చింతల శ్రీను, గోవిందరాజు, వంశీ, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.