ముద్ర ప్రతినిధి, మెదక్:
పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 241 తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పదవ తరగతి విద్యార్థులకు కులం ఆదాయం, జనన ధృవీకరణ పత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి ధీటుగా నాణ్యమైన గుణాత్మక విద్యను అందిస్తుందని దానికి అనుగుణంగా ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆకాంక్షించారు. ఫీజు రాయితీలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలను విరిగా పాఠశాలకు పంపించి చదువుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, తహసిల్దార్ చంద్రశేఖర్, ఎంఈఓ సత్యనారాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు.
త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 16న జరుగు 21 మండల కేంద్రాలు, 4 మున్సిపాల్టీలలో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
గూగుల్ మీట్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు.
రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ కార్యక్రమం గురించి సభల్లో తెలియజేయాలని అన్నారు ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టాలన్నారు..
ఈ గూగుల్ మీట్లో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిసిహెచ్ఎస్ శివదయాల్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజి, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, డిపిఓ యాదయ్య, ఆర్అండ్ బి ఈఈ వేణు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు