ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ బోధన్ చౌరస్తాలో బుధవారం అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులు, పోలీసులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో అతివేగం, అజాగ్రత్త వల్ల ఎందరో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, నాయకుడు అంజద్, సిద్దిరాములు, ఏఎస్ఐ రుక్సానా, గిరిజన గురుకుల విద్యార్ధినీలు తదితరులు పాల్గొన్నారు.
