Take a fresh look at your lifestyle.

మాదక ద్రవ్యాల నిషేధంపై విస్తృత ప్రచారం

  • కలెక్టర్ అభిలాష అభినవ్.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మారే దిశగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందాలు మరింత ప్రభావవంతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రచార రథాన్ని ఆమె ప్రారంభించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, వయోవృద్ధుల సంక్షేమ చట్టాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రగతిరథం -ప్రజా చైతన్యం ప్రచార రథయాత్ర ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల కారణంగా యువత భవిష్యత్తు అంధకారంలో నిత్యం నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 2న మాదకద్రవ్యాల రహిత నిర్మల్ జిల్లా ఏర్పాటు చేపట్టిన నేపథ్యంలో నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను గ్రామస్థాయిలోనూ స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, వయోవృద్ధుల హక్కులు, బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక నిషేధం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కళాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఇ. విష్ణువర్ధన్, కళాకారులు సుదర్శన్, నాగరాజు, రఘునాథ్, లక్ష్మణ్, సుదర్శన్, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.